‘వార్ 2’ బొమ్మ అదిరిపోయింది అని కాలర్ ఎత్తి మరీ చెప్పాడు ఎన్టీఆర్. ఆయన, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. బ్లాక్ బస్టర్ ‘వార్’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న వార్ 2 ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “25 ఏళ్ల క్రితం హృతిక్ రోషన్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. కహోనా ప్యార్హై సినిమాలో హృతిక్ డాన్స్ చూసి ఆయనకి అభిమానినయ్యా. ఈరోజు ఇండియాలోని ఫైనెస్ట్ యాక్టర్స్‌లో హృతిక్ రోషన్ ముందుటారు. తను ఎంత గొప్ప నటుడో, అంత గొప్ప వ్యక్తి. దేశంలో ఆయనలాంటి డాన్సర్ లేరు. అలాంటి వ్యక్తితో డాన్స్ చేయడం, కలిసి నటించడం నా అదృష్టం.”
“కీర్తిశేషులు రామోజీరావు గారు ఆయన బ్యానర్లో నన్ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. నా మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్‌కి వెళ్లినప్పుడు నాతో మా అమ్మా,నాన్న తప్ప ఎవరూ లేరు. అయితే ఈనాడు కోట్లాదిమంది నాతో ఉన్నారు. దీనికి కారణం తల్లిదండ్రుల ఆశీస్సులు. అన్నింటినీ మించి మా తాతగారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి దీవెనలు. ఆయన చల్లని చూపు నాపై ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.”
“నా మొదటి అభిమాని ముజీబ్ నాటినుంచి నేటివరకూ నాతోనే ఉన్నాడు. అభిమానుల్ని ఆనందింపజేయడమే నా ముందున్న లక్ష్యం. మీకోసం ఎంతదూరం అయినా వెళ్తా. ఎక్కడికెళ్లాలనుకున్నా మిమ్మల్ని తీసుకొనే, మీతోపాటు వెళ్తా. ఇది నాకు ఫస్ట్ హిందీ మూవీ, అలాగే హృతిక్ సార్‌కి ఇది తొలి తెలుగు ఫిల్మ్. అయాన్ ముఖర్జీ దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదుగుతారు. అంత గొప్పగా ఈ సినిమా తీశారు” అని అన్నారు ఎన్టీఆర్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























