మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ కాంతతో రానున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని అంచనాలను పెంచేసింది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.రేపు సాయంత్రం 4:30 గంటలకు ఈ సాంగ్ విడుదలకానుంది.కాంతను తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.సెప్టెంబర్ 12న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దుల్కర్ సల్మాన్.అంతే కాదు ఈసినిమాతో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ప్రస్తుతం దుల్కర్ మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.ఇందులో రెండు తెలుగు సినిమాలు వున్నాయి. అవేంటంటే …
లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ తెలుగులో పవన్ సాధినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.
ఇక కొద్దీ రోజుల క్రితం మరో తెలుగు సినిమా స్టార్ట్ చేశాడు దుల్కర్.లవ్ స్టోరీ గా దర్శకుడు రవి నెలకుడిటి తెరకెక్కిస్తున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























