బ్యాడ్ బాయ్ కార్తీక్ నుండి మాస్ సాంగ్ రిలీజ్

Naa Maava Pillanitthaanannade Lyrical Song Released From Bad Boy Karthik

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య చాన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్రెష్ కంటెంట్‌తో తెరకెక్కుతోన్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి కార్తీక్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగశౌర్య జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా తాజాగా బ్యాడ్ బాయ్ కార్తీక్ నుండి క్రేజీ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నా మావ పిల్లనిత్తానన్నాడే’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌కి గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, కారుణ్య, హరి ప్రియ ఆలపించారు. ఈ పాట సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

కాగా ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, మైమ్ గోపి, శివన్నారాయణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్న ఈ సినిమాతో సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలుగులోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఆయన దీనికి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్షన్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై డా. అశోక్ కుమార్ చింతలపూడి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.