గూఢచారి 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Goodachari 2 Release Date Locked

సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్‌ గా వస్తున్న సినిమా గూఢచారి 2. ఈస్పై థ్రిల్లర్ లో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో పాన్-ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో హిందీ నటి వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఈరోజు తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.6 దేశాల్లో 150 రోజులు ఈసినిమా చిత్రీకరణ జరిపారు.ఇక ఈరోజు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది మే 1న ఈసినిమా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ,ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.గూఢచారి 7 ఏళ్ళ క్రితం వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.దాంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈసినిమాతో అడివి శేష్ మరో హిట్ ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

ఇక అడివి శేష్ ఈసినిమా కన్నా ముందు డెకాయిట్ తో రానున్నాడు.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా లవ్ స్టోరీ నేపథ్యంతో వస్తుంది. షానీల్ డియో డైరెక్ట్ చేస్తుండగా అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుంది.డిసెంబర్ 25న ఈసినిమా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.