హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.మొత్తం ఇందులో రెండు పాటలు ఉండగా ఫస్ట్ సాంగ్ ను హృతిక్ ,కియరా అద్వానీ లపై చిత్రీకరించారు.అవాన్ జవాన్ అంటూ ఈసాగే ఈపాటను ఈనెల 31న రిలీజ్ చేయనున్నారు.ఇటలీలో ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఇక మరో సాంగ్ ను హృతిక్ ,ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో ఈసినిమాను నాగవంశీ విడుదలచేస్తున్నాడు.అందుకు గాను భారీ ధరకు వార్ 2 థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే భారీ వసూళ్లను రాబట్టాల్సివుంటుంది.అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.వార్ 2 విడుదలవుతున్న రోజే లోకేష్ కనగరాజ్ -రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో వార్ 2కు బాక్సాఫీస్ వద్ద వార్ ఎదురుకానుంది.
బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2కి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.హిందీ ,తెలుగు, తమిళంలో ఆగస్టు 14న విడుదలకానుంది.ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో కూడా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























