యంగ్ హీరో విజయ్ దేవరకొండ – జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్. ఎట్టకేలకు మరో వాయిదా లేకుండా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది. హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 26న ట్రైలర్ వదలనున్నారు. ఇందుకోసం తిరుపతి లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కీలకమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరగనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.అన్ని కుదిరితే ఈనెల 28న ఈవెంట్ జరుగనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.నాగవంశీ ఈసినిమా విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
అటు విజయ్ కి ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది. గత కొన్నేళ్ల నుండి విజయ్ కి సరైన హిట్ పడలేదు.అయితే ఈసారి కింగ్డమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఇక విజయ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు వున్నాయి.అందులో రవి కిరణ్ కోలా తో ఓ సినిమా చేయనుండగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తో మరో సినిమా చేయనున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























