జూనియర్‌ కోసం కిరీటి ప్రతిక్షణం క్యారెక్టర్ లోనే జీవించాడు – రవిచంద్రన్

Kireeti Gave 100% Efforts For Junior, Says Actor Ravichandran

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా యాక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఇది ఎక్స్ట్రార్డినరీ మూవీ. ఈ సినిమా ఒక తండ్రి కల గురించి ఉంటుంది. ఈ సినిమాతో మూడేళ్ల జర్నీ ఉంది. ఈ టీమ్ అందరితో ఒక ఎమోషన్ ఉంది. ఇందులో నేను ప్లే చేసిన ఫాదర్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ని ప్లే చేయడం చాలా ఆనందంగా ఉంది.”

“తండ్రి కొడుకుల అనుబంధం వారి మధ్య ఉన్న భావోద్వేగం అందరినీ కదిలిస్తుంది. ఇలాంటి అద్భుతమైన కథరాసిన రాధాకృష్ణకి సెల్యూట్. సెంథిల్ కుమార్. దేవి శ్రీ ప్రసాద్ గారు, జెనీలియా గారు అందరూ ఈ సినిమాకి గొప్ప బలాన్ని చేకూర్చారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. కిరీటి 100% ఎఫర్ట్ పెట్టాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒక విద్యార్థి లాగే నేర్చుకున్నాడు. ప్రతిక్షణం క్యారెక్టర్ లోనే జీవించాడు. జూలై 18న థియేటర్స్‌లో జూనియర్‌ని సెలబ్రేట్ చేసుకుందాం.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.