వార్ 2 షూటింగ్ కంప్లీట్

War 2 shooting is completed

హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ , తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులో కూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది. సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉండగా నిన్నటితో అది పూర్తి చేశారు.ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వార్ 2 షూట్ కంప్లీట్ అయ్యింది.ఈ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నదీ, పొందిన అనుభవాలూ ఎన్నో…హృతిక్ సార్‌తో సెట్లో ఉండటం ఎప్పుడూ ఒక మంచి అనుభూతి.అయన ఎనర్జీని నేను ఎప్పటినుంచో ఎంతో అభిమానంతో చూస్తున్నాను.ఈ వార్ 2 ప్రయాణంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అయాన్ అద్భుతంగా దర్శకత్వం వహించాడు.ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజీని అందించబోతున్నాడు.యష్ రాజ్ టీంకి అలాగే మా కష్టపడ్డ షూటింగ్ క్రూ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ఈ ఆగస్టు 14న మీరు ఈసినిమాను ఎక్స్ పీరియెన్స్ చేయనున్నారు అందుకు నేను వేచి వుండలేను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

ఇక త్వరలోనే వార్ 2 ప్రమోషన్స్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకు ఎర్లీ మార్కింగ్ షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఆగస్టు 14న వార్ 2 థియేటర్లోకి రానుంది. అయితే అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీ కూడా విడుదలకానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెసింగ్ క్లాష్ జరుగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.