పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రీసెంట్గా విడుదలైన వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కూడా అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించింది. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అందింది.
హరిహర వీరమల్లు తమిళనాడు థియేట్రికల్ హక్కులను శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ దక్కించుకుంది. పవన్ కళ్యాణ్‌కు తమిళనాడులో కూడా భారీగా అభిమానులుండటం, మరోవైపు ప్రస్తుతం ఏపీకి ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆయన నటించిన సినిమా విడుదల కానుండటంతో వీరమల్లు చిత్రంపై తమిళనాడులో కూడా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ పవర్ స్టార్ సినిమాను తమిళంలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























