ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

Personality Development Expert and Magician BV Pattabhiram Passed Away

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు ఇంద్రజాలికులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన నేడు హైదరాబాదలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే బీవీ పట్టాభిరామ్‌ అంటే అందరికీ హిప్నాటిస్ట్‌గానే తెలుసు. కానీ మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. పట్టాభిరామ్‌కు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. జయ కూడా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలుగా పేరొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం పట్టాభిరామ్‌ పార్థివదేహాన్ని ఖైరతాబాద్ లోని వారి స్వగృహంలో ఉంచారు. అయితే ఆయన అభిమానులు మరియు ప్రజల సందర్శనార్థం రేపు (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో పట్టాభిరామ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

పట్టాభిరామ్‌ది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా. ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ 15మంది సంతానంలో ఈయన ఒకరు. కాకినాడలో ఉన్నత విద్య అభ్యసించే రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యలో కిటుకులు నేర్చుకున్నారు. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లో భారత ఆహార సంస్థ (FCI)లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి అక్కడే స్థిరపడ్డారు.

ప్రముఖ దర్శకుడు జంధ్యాల రూపొందించిన ‘రెండురెళ్ళ ఆరు’ అనే చిత్రంలో తన పాత్రలోనే నటించారు. ఇక పట్టాభిరామ్‌ మృతిపై తెలుగు రాష్ట్రాలలోని పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమందికి వ్యక్తిత్వ వికాసంలో తోడ్పడినందుకు, అలాగే సైకాలజీ, హిప్నాటిజం రంగాలలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకుంటున్నారు.

ఇక ఈ విషాద సమయంలో పట్టాభిరామ్‌ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తెలుగు ఫిల్మ్ నగర్ తరపున ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.