మాస్ మహారాజ రవితేజ నెక్స్ట్ సినిమా లాక్ అయ్యింది.నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ తన 76వ సినిమా చేయనున్నాడు.సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనున్నారు.రేపు ఈసినిమా గ్రాండ్ గా లాంఛ్ కానుంది.ఈ సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.పోస్టర్ చూస్తుంటే ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో జరిగేలా వుంది.రేపు ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమా మాస్ జాతర లో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే. కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 27న థియేటర్లలోకి రానుంది.
ఇక ధమాకా తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు రవితేజ.అయితే మాస్ జాతర ఆ రేంజ్ హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.మరి ఈసినిమాతోనైనా రవితేజ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























