హరిహర వీరమల్లు 4th సింగిల్ వస్తోంది

Hari Hara Veera Mallu 4th Single Taara Taara Release Date Fix

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలచేసిన మూడో పాట ‘అసుర హననం’ ఫుల్ యాక్షన్ మోడ్‌లో తెరకెక్కింది. ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం గూజ్ బంప్స్ తెప్పించింది. మంచి ఉత్తేజం, ఉద్వేగం కలగలసి రూపొందించిన ఈ పాట సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా వీరమల్లు నుంచి నాలుగో సింగిల్ వస్తున్నట్టు తెలిపింది చిత్ర బృందం. ‘తార తార’ అంటూ సాగే ఈ పాట ఫుల్ వీడియో మే 28న ఉదయం 10:20 గంటలకు విడుదలకానుందని వెల్లడించింది.

ఇక హరిహర వీరమల్లులో ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.