మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది.ఫస్ట్ డే నుండే చిరు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.అనిల్ రావిపూడి మార్క్ ఎంటరైనర్ గా రానున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవితో తనకు ఇది రెండో సినిమా.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఇందులో వింటేజ్ చిరును చూపించనున్నాడు అనిల్ రావిపూడి.ఇక సంక్రాంతికి వస్తున్నాం తరువాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమాకావడంతో మెగా 157 పై అంచానాలు భారీగా వున్నాయి.
ఇక ఈసినిమాకన్నా ముందు చిరంజీవి, విశ్వంభరతో థియేటర్లలోకి రానున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























