ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్

ntr completed the first schedule shooting of ntr Neel

ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ ల మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ లేకుండానే ఈ సినిమా ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.ఇక రీసెంట్ గా మరో షెడ్యూల్ లో స్టార్ట్ కాగా ఇందులో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు. దాదాపు రెండు వారాల పాటు జరిగిన ఈషెడ్యూల్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.కర్ణాటక లో జరిగిన ఈషెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది. రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.రీసెంట్ గా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.ముందుగా జనవరి 9న థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ అప్పటికి రెడీ అయ్యేలా కనిపించకపోవడంతో జూన్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈనెల 20న ఈసినిమా నుండి అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నారు.

ఇక ఈసినిమా కన్నా ముందు ఎన్టీఆర్ వార్ 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న విడుదలకానుంది.ఎన్టీఆర్ కు హిందీలో ఇదే మొదటి సినిమా.ఈసినిమా నుండి కూడా ఎన్టీఆర్ బర్త్ డే న అప్డేట్ వచ్చే ఛాన్స్ వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.