చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది – కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram Reveals Interesting Facts About Arjun Son of Vyjayanthi Movie

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరులో జరిగిన ఈవెంట్‌లో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ముచ్చటగా బంధాలే’ సాంగ్‌ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “చిత్తూరు ప్రజలకు ఇక్కడే విద్యార్థులకు, మా నందమూరి అభిమానులందరికీ లవ్ యు ఆల్. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. కాలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్. ఇక్కడ ఎంజాయ్ చేయండి. బాధ్యతగా ఉండండి. నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నదే రేపు మనకి లైఫ్ ఇస్తుంది.” అని తెలిపారు.

“ఒక అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది. తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా”

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.