ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. ఈ మూవీలో ‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సెట్ చేయబడింది, ఆశిష్ లోకల్ బాయ్‌గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం కథకు రగ్గడ్ అండ్ గ్రిట్టీ ఎట్మాస్పియర్‌తో ఇంటెన్స్ని యాడ్ చేస్తోంది. ఇప్పటికే తన మునుపటి పాత్రలలో వెర్సటాలిటీని ప్రజెంట్ చేసిన ఆశిష్, ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కానున్నారు. మరింత ఇంటెన్స్, మాస్-ఓరియెంటెడ్ లుక్‌లో కనిపించబోతున్నారు.
డెబ్యు డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని ఈ సినిమా కోసం హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన కథని రెడీ చేశారు. ఎక్సైట్మెంట్ని మరింత పెంచుతూ, నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్‌గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్ని అనౌన్స్ చేశారు. ఈ నటీనటుల ఎంపిక అన్ని వయసుల నటులకు ఓపెన్‌గా వుంటుంది.
ఇది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి గొప్ప అవకాశం అందిస్తుంది. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ గల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరోసారి హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ గల చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























