ఈనెలలో మచ్ అవైటెడ్ మూవీగా వస్తుంది తండేల్.నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటించగా కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ కాగా అన్ని సూపర్ హిట్ అయ్యి 100 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకున్నాయి.ఒకరకంగా సినిమా కు హైప్ రావడం లో సాంగ్స్ కీ రోల్ ప్లే చేశాయి. దేవి మ్యూజిక్ కు ప్రశంసలు దక్కాయి.అయితే ముందు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను వద్దనుకున్నామని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవి ఆ టైంలో పుష్ప 2 తో ఫుల్ బిజీ గా వున్నాడు.అది చాలా పెద్ద సినిమా.దాంతో డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదని వేరే మ్యూజిక్ డైరెక్ట్ తీసుకుందామని సందేహిస్తుండగా ఓ రోజు బన్నీతో చర్చించాను.అప్పుడు బన్నీ, దేవి శ్రీ ప్రసాద్ అయితే బాగుంటుంది.లవ్ స్టోరీ కాబట్టి దేవినే కరెక్ట్ అని అన్నాడు.మీరు ఎలాగూ మొత్తం రాబట్టుకుంటారు.ఆలోచించకండి దేవిని తీసుకోండి అని అన్నాడు.అలా తనను తీసుకున్నామని అల్లు అరవింద్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లో వెల్లడించారు.
అలాగే సినిమాను ముందు నార్మల్ బడ్జెట్ లో తీద్దామనుకున్నాం కానీ కుదరలేదు.హై బడ్జెట్ కు వెళ్లిందని అదే మాకు అతి పెద్ద తుపాను అని అల్లు అరవింద్ అన్నారు.అంతేకాదు సినిమా సక్సెస్ పై అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.ఈనెల 7న ఈసినిమా తెలుగు తోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























