ఎన్టీఆర్‌.. నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారం – బాలకృష్ణ

Nandamuri Balakrishna Pays Tribute at NTR Ghat

లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. తనయుడు, నట వారసుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం సోదరుడు రామకృష్ణతో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న బాలకృష్ణ తండ్రికి పుష్పాంజలి ఘటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే రామారావు మనవలు, స్టార్ నటులు జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఇక యుగపురుషుడు, మహా నేత, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని తమ ప్రియతమను స్మరించుకుంటూ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్‌. తెలుగునాట నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టింది. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్‌ అంటే నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారం. ఎన్టీఆర్‌ అంటే ఒక వర్సిటీ.. జాతికి మార్గదర్శకం. అలాంటి మహనీయులకు ఎప్పటికీ మరణం ఉండదు” అని పేర్కొన్నారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.