గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావటం విశేషం.
ఈ సందర్భంగా రామ్ చరణ్ నటనపై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. “ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్ ఎగ్జైట్మెంట్‌ను ఇచ్చింది. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్‌కే రామ్ చరణ్ ఎంతో ఎదిగి పోయాడు. మగధీర టైంలో రామ్ చరణ్‌ను హీరో అని పిలుస్తూ ఉండేవాడ్ని. హెలికాప్టర్ నుంచి లుంగీ కట్టుకుని కత్తి పట్టుకుని దిగుతుంటే.. విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుస్తోంది. జనవరి 10న థియేటర్లోకి గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి” అని అన్నారు రాజమౌళి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























