పొంగల్ బరి నుంచి తప్పుకున్న విడాముయార్చి

Ajith Kumar's Vidaamuyarchi Postponed From Pongal Race

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌ కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయార్చి’. త్రిష‌ కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచ‌నాలు నెలకొన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇదిలావుంటే, తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. విడాముయార్చి విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు ఈ చిత్రం పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది.

కానీ అనివార్య కారణాల వలన విడాముయార్చి రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఈ మేరకు న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో ‘థలా’ (అజిత్) అభిమానులకు సారీ చెబుతూ.. సినిమా వాయిదా పడినట్టు తెలిపారు. అయితే న్యూ రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు యూనిట్. ఇక విడాముయార్చి పొంగల్ బరినుంచి తప్పుకోవడంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్.. విడాముయార్చి సినిమాను నిర్మిస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రానికి ఓం ప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేస్తున్న ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.