“జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ…” అంటూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో తన తండ్రి ఫొటోకు నమస్కరిస్తూ కనిపించారు చిరంజీవి. నేడు తన తండ్రి కొణిదెల వెంకటరావు గారి వర్ధంతి సందర్భంగా మెగా ఫామిలీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిరంజీవి నివాసంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయనతోపాటు తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ, తమ్ముడు నాగబాబు, వారి సోదరి ఇంకా ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కాగా జీవితంలో ఎన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించినా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంతగానో గౌరవించే మెగాస్టార్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇకఇదిలావుంటే, చిరంజీవి ప్రస్తుతం కథానాయకుడిగా ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ మూవీని సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























