సల్మాన్ ఖాన్ ‘సికందర్’ టీజర్‌ రిలీజ్ వాయిదా

Salman Khan's Sikandar Teaser Release Postponed For Tomorrow

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’. ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌ ప్లే చేస్తుండగా.. ‘కట్టప్ప’ సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వీరుడి కథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని బాలీవుడ్ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. ఇక ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుక‌గా థియేటర్లలో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించడానికి టీమ్ సిద్ధమైంది. దీనిలో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్‌ ఈరోజు ఉదయం 11:07 గంటలకు రిలీజ్ కావాల్సివుంది. కానీ చివరి నిమిషంలో దీనిని వాయిదా వేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

దీంతో సల్లూ భాయ్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే రేపు ఉదయం అదే సమయానికి సికందర్ టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. కాకపోతే ఇంత హఠాత్తుగా టీజర్ పోస్ట్ పోన్ కావడానికి కారణమేంటంటే..? మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ గురువారం రాత్రి క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపంగా టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను వాయిదా వేశారు నిర్మాతలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.