ప్రదీప్ మాచిరాజు మూవీ నుంచి.. ‘టచ్‌లో ఉండు’ సాంగ్ రిలీజ్

Touch Lo Undu Song Released From Akkada Ammayi Ikkada Abbayi

పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి నటించిన సెకండ్ సింగిల్ ‘టచ్‌లో ఉండు’ సాంగ్ విడుదల చేసారు.

లీడ్ పెయిర్ సందడి చేసిన రొమాంటిక్ నెంబర్ లే లే తర్వాత, రెండవ పాట టచ్ లో ఉండు మాస్ అప్పీల్‌కు పర్ఫెక్ట్ లైవ్లీ, హై-ఎనర్జీ బీట్‌ను అందించింది. చంద్రిక రవి లైవ్లీ , కలర్‌ఫుల్ సెట్టింగ్‌లో ప్రదీప్ మాచిరాజుతో కలిసి డ్యాన్స్ చేస్తూ గ్లామర్‌ను యాడ్ చేసింది. ప్రదీప్ తన డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు, మాస్‌ని అలరించే పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించాడు. చంద్రబోస్ రాసిన మాస్ లిరిక్స్‌ అలరించాయి.

లక్ష్మీ దాస, పి రఘుల ఎనర్జిటిక్ వోకల్స్ ఈ పాటను ఫ్యాన్స్ అఫ్ మాస్ హిట్ చేశాయి. మొత్తానికి ఆకట్టుకునే రిథమ్, వైబ్రెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజిక్ సెన్సేషన్ గా మారుతోంది. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.