నా ఫస్ట్ సినిమా జర్నీ అల్లరి నరేష్ గారితోనే స్టార్ట్ అయింది

Director Maruthi Recalls Career Beginning Days with Allari Naresh

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్నారు. అలాగే సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి తాను సినిమాల్లోకి వచ్చినప్పటి రోజులను, అప్పుడు అల్లరి నరేష్‌తో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మారుతి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ సుబ్బు. సోలో బ్రతుకే సో బెటరు కథని తను చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఆ సినిమా నుంచి మా ఇద్దరికీ ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఈ కథ కూడా నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది.”

“ఎంత అద్భుతంగా చెప్పాడో అంత అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. నా ఫస్ట్ సినిమా జర్నీ అల్లరి నరేష్ గారితోనే స్టార్ట్ అయింది. ఆయన ప్రాణం సినిమా డిస్ట్రిబ్యూషన్ లో నేను కలిశాను. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే కసిని పెంచింది. అక్కడి నుంచి నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది.”

“రాజేష్ గారికి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఆయనకి ఆడియన్ గా మంచి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జ్మెంట్ తోనే ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ష్యూర్ షాట్ గా హిట్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.