టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హీరోలతో సరిసమానమైన ఇమేజ్ ఈ స్టార్ ప్రొడ్యూసర్ సొంతం. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగానే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు దిల్ రాజు. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాలో 1970 డిసెంబరు 18న జన్మించిన దిల్ రాజు సినిమాలపై ఆసక్తితో తొలిసారిగా 1997లో ‘పెళ్లి పందిరి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు దిల్ రాజు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఈ క్రమంలో తాను నిర్మించిన మొదటి చిత్రం ‘దిల్’ బిగ్ సక్సెస్ అవడంతో ఆ తర్వాత అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటినుంచి ఆయన ‘దిల్’ రాజుగా పాపులర్ అయ్యారు. ఇక ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ బొమ్మే అని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది. సినీరంగంలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో ఇటీవలే ఒక కొత్త బ్యానర్‌ను కూడా ప్రారంభించారు.
కాగా దిల్ రాజు గతేడాది జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే తాజాగా ఆయనను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆయన టీఎఫ్‌డీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























