అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ రిలీజ్ డేట్ ఫిక్స్

Ashok Galla's Devaki Nandana Vasudeva Release Date Announced

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని టీజర్‌లో తేలింది. మొదటి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో రెగ్యులర్ అప్ డేట్స్ తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.

దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అశోక్ గల్లా సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుండగా, ఒక వైపు సాధువు, మరొక వైపు అంత శక్తివంతమైన గెటప్ లో మనం చూడవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మనం చూడవచ్చు.

ఇక ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది, దీనికి కథను హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించారు, ప్రశంసలు పొందిన సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల మరియు రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. ఇంకా తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.