దేవర 2 కంటే ముందు కొరటాల మరో సినిమా

Koratala Siva is planning to do a film before Devara 2
Koratala Siva is planning to do a film before Devara 2

ఆచార్య కన్నా ముందు తీసిన అన్ని సినిమాలు కొరటాల శివకు మంచి పేరు తోపాటు సూపర్ సక్సెస్ ను తీసుకొచ్చాయి.అయితే ఆచార్యతో ఫస్ట్ ప్లాప్ రుచి చూడడం తో పాటు విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.ఆసినిమా కొరటాల బ్రాండ్ పై చాలా ప్రభావం చూపించింది.ఇక ఆచార్య తరువాత ఆయన చేసిన సినిమా దేవర.తనకు జనత గ్యారేజ్ తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కొరటాలను నమ్మి ఎన్టీఆర్ దేవర చేశాడు.ఈసినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.ప్రస్తుతం 400కోట్ల మార్క్ దాటి సాలిడ్ రన్ కొనసాగిస్తోంది.దేవరతో ఎన్టీఆర్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ కావడమే కాదు కొరటాల శివ కం బ్యాక్ ఇచ్చారు.అయితే ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ ఇప్పుడప్పుడే పార్ట్ 2 స్టార్ట్ అయ్యేలా లేదు.ఎందుకంటే వచ్చే ఏడాది వరకు ఎన్టీఆర్ ఫుల్ బిజీ కానున్నాడు.అందులో భాగంగా హిందీ లో వార్ 2 ఒప్పుకున్నాడు అలాగే ప్రశాంత్ నీల్ తో 31వ సినిమా చేయనున్నాడు.ఈరెండు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి.ఆ లెక్కన ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్టీఆర్ ఫ్రీ అవ్వనున్నాడు. అప్పుడుగాని దేవర 2 స్టార్ట్ కాదు.అయితే ఈ గ్యాప్ లో కొరటాల శివ ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట.తన దగ్గర కథలు రెడీ గా వున్నాయి.

ఎలాగూ వచ్చే ఏడాది వరకు టైం వుంది కాబట్టి ఈలోగా మరో సినిమా తీయాలని భావిస్తున్నారట.కాకపోతే హీరోలు దొరకడం తనకు సమస్యగా మారనుంది.ఎందుకంటే ఈ డైరెక్టర్ మిర్చి నుండి స్టార్ హీరోల తో సినిమా చేస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం మహేష్ ,ప్రభాస్ ,అల్లు అర్జున్ , రామ్ చరణ్ వీరెవరూ కాలీగా లేరు.దాంతో హీరో దొరకడం సమస్య కానుంది.కొరటాల ఇమేజ్ కు తగ్గ హీరో కావాలి.కానీ ఆ రేంజ్ హీరోలు కాలీగా లేరు.మరి కొరటాల ఏం చేస్తారో చూడాలి.దేవర 2 వరకు ఆగుతారా లేక అడ్జెస్ట్ అయిపోయి వేరే హీరో ఎవరితోనైనా సినిమా చేస్తారో.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.