హరిహర వీరమల్లు కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Hari Hara Veera Mallu Hollywood Legend Nick Powell To Work with Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికి సంకల్పించారు. ఈ క్రమంలో ‘హరిహర వీరమల్లు’ మొదటి భాగం యొక్క మిగిలిన షూటింగ్‌లో పాల్గొనడానికి నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి చేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాగా ఇందులో పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్‌గా కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా ఈ మూవీ కోసం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ పనిచేయనుండటం విశేషం. ఆయన ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని, సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తామని నిర్మాతలు తెలిపారు.

‘బ్రేవ్‌హార్ట్’, ‘గ్లాడియేటర్’, ‘బోర్న్ ఐడెంటిటీ’, ‘ది లాస్ట్ సమురాయ్’, ‘రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్’ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పావెల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు.

నిక్ పావెల్ తన అసాధారణ నైపుణ్యంతో ‘హరి హర వీర మల్లు’ యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు.

మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు జ్యోతికృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన సినిమా చిత్రీకరణ, నూతన తారాగణం, సాంకేతిక సిబ్బంది చేరిక వంటి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అలాగే ఆయన విడుదల చేసిన టీజర్, ఈ చిత్రంపై అంచనాలను మరింత పెరిగేలా చేసింది.

ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడుగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.