నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. ఇటీవలే ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన రీసెంట్‌గా తన ఓన్ ప్రొడక్షన్‌లో బ్లాక్ బస్టర్ ‘హిట్’ ఫ్రాంచైజీ ‘హిట్ పార్ట్ 3’ని ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ కాంబోలో కొత్త సినిమాను పట్టాలెక్కించేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంతకుముందు ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీలో నటించిన నాని.. మరోసారి ఈ ట్యాలెంటెడ్ దర్శకుడితో చేతులు కలిపాడు. తాజాగా దీనికి సంబంధించి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల చిత్రీకరించిన అనౌన్స్‌మెంట్ వీడియో నుండి తెరవెనుక స్నాప్‌ను పంచుకున్నాడు.
ఎక్స్ వేదికగా శ్రీకాంత్ ఇలా తెలిపారు.. “మార్చి 7, 2023 – నా మొదటి సినిమా #దసరాకి నేను చెప్పిన చివరి “కట్, షాట్ ఓకే.” సెప్టెంబర్ 18, 2024 – #NaniOdela2 అనౌన్స్‌మెంట్ వీడియో కోసం “యాక్షన్” అని చెప్పడం. 48,470,400 సెకన్లు గడిచాయి! ప్రతి సెకను నా తదుపరి కోసం అత్యంత చిత్తశుద్ధితో గడిపాను. నాని ఓడెలా2 నాని అన్న ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఆఫ్‌తో దసరాకు 100 రెట్లు ప్రభావాన్ని సృష్టిస్తానని నేను హామీ ఇస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఇక వీరి కాంబోలో వచ్చిన తొలిసినిమా దసరా 100 కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























