స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సిటాడెల్ కు హిందీ వెర్షనే అన్న సంగతి కూడా విదితమే. ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఆమధ్య హిందీ వెర్షన్ టైటిల్ ను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు సిటాడెల్-హనీ బన్నీ టైటిల్‌ను ఫైనల్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత ఈ వెబ్ సిరీస్ నుండి ఒక అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఆగష్ట్ 1 వ తేదీన సర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతుందని తెలిపారు. అయితే 1వ తేదీన రిలీజ్ డేట్ వస్తుందా? లేదా టీజర్ అప్ డేట్ వస్తుందా అన్నది చూడాలి.
ఇంకా ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే డీటూఆర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























