టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. రెండేళ్ల క్రితం ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ‘అమిగోస్’, ‘డెవిల్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
NKR21 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకుముందు ఈ సినిమా నుంచి ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో విడుదల చేసిన 33 సెకన్ల నిడివిగల స్పెషల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. శుక్రవారం కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా #NKR21 నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. ఒక రూమ్‌లో మంటలు చెలరేగుతుండగా.. కళ్యాణ్ రామ్ కుర్చీలో కూర్చుని పిడికిలి బిగించి పట్టుకుని చాలా సీరియస్‌గా చూస్తున్నాడు. ఇక ఆ పిడికిలి నుంచి కూడా మంటలు వస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఆయన ముందు ఒక వ్యక్తి పడిపోయి ఉండగా, వెనుకవైపు మరికొందరు నిలబడి ఉన్నారు. చూస్తుంటే.. ఇదేదో హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లా అనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ ముప్పాలతో కలిసి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ వీలైనంత త్వరగా ముగించి భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























