ఈ వారం కూడా మూడు సినిమాలు

Three movies are coming out this week

గత వారం మూడు సినిమాలు రిలీజ్ కాగా అందులో మొదటి రోజు  రెండు సినిమాలు డల్ గా స్టార్ట్ అయ్యాయి అయితే తర్వాత రెండు రోజులు పుంజుకొని మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి.ఇక ఈ వారం కూడా నోటెడ్ గా మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.అందులో మనమే,సత్యభామ,లవ్ మౌళి వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటిలో మనమే ఎక్కువ అంచనాలతో విడుదలవుతుంది.శర్వానంద్ -కృతి శెట్టి జంటగా నటించడం ట్రైలర్ యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి వస్తుండడంతో  గట్టిగానే సౌండ్ చేస్తుంది.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉండడంతో మరింత మైలేజ్ రానుంది. శ్రీ రామ్ ఆదిత్య ఈసినిమాను డైరెక్ట్ చేయగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.

ఇక కాజల్ లీడ్ రోల్ లో నటించిన సినిమా సత్యభామ పలు సార్లు వాయిదా పడి ఈవారం థియేటర్లలోకి వస్తుంది.మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించాడు. గూఢచారి, మేజర్ డైరెక్టర్ శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేశాడు.ఈసినిమాపై కూడా మంచి అంచనాలు వున్నాయి.
ఇక నవదీప్ నటించిన లవ్ మౌళి కూడా ఈరెండు సినిమాలతో పోటీపడుతోంది.యూత్ ను టార్గెట్ ను చేసుకొని వస్తుంది ఈసినిమా.కంటెంట్ మీద వున్న నమ్మకంతో  ఈరోజు సెలెక్టెడ్ థియేటర్లలో ప్రీమియర్లు వేస్తున్నారు.అవణేంద్ర ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.