పెద్ద పెద్ద పండుగల వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద పోటీ ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. పెద్ద పండుగలు కాబట్టి పెద్ద సినిమాలే ముందుగా డేట్లను రిజర్వ్ చేసుకుంటాయి. ఇప్పటికే సంక్రాంతి అయిపోయింది కాబట్టి వచ్చేది దసరా పండుగ. ఈ దసరాకు ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమా డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా దసరా బరిలోకి దేవరకు పోటీగా రానుంది. ఈ సినిమా మరేదో కాదు తలైవా రజనీకాంత్ వైట్టైయాన్ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న సినిమా వెట్టైయాన్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే రజనీకాంత్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు కూడా . మిగిలిన పోర్షన్స్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు చిత్రబృందం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రజనీకాంత్. ప్రస్తుతం రజనీ స్పిరిట్యువల్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. హిమాలయాల పర్యటనకు వెళ్లిన రజనీ అక్కడ పలువురితో ముచ్చటించారు. ఈనేపథ్యంలో తన అప్ కమింగ్ సినిమా వెట్టైయనా గురించి మాట్లాడుతూ..దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఇంకా లోకేష్ కనగరాజ్ సినిమా గురించి కూడా చెబుతూ జూన్ నుండి ఈసినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిపారు.
ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అక్టోబర్ 10 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా ముగించుకుంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























