మ్యాడ్ తరువాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నుండి వస్తున్న సినిమా ఆయ్. గోదావారి బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్రెండిష్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ఈ మేలోనే విడుదలకావాల్సి ఉండగా వాయిదా వేశారు.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట సుఫియానా రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రెండో పాట రంగనాయకిని రిలీజ్ చేశారు. జోష్ ఫుల్ సాంగ్ గా వచ్చిన ఈ రంగనాయకిలో నితిన్ డ్యాన్స్ హైలెట్ అయ్యింది.నితిన్ డ్యాన్స్ తో ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణ ఇలా మరికొందరు సీనియర్ హీరోలను ఇమిటేట్ చేశాడు అలాగే సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ను కూడా వాడుకున్నారు.రామ్ మిర్యాల ఇచ్చిన ట్యూన్స్ అదిరిపోయాయి.ఓవరాల్ గా రెండో పాట కూడా అదరగొట్టింది.అంజి కె మణిపుత్ర డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్,విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు.జూన్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక నితిన్ ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ లో నటిస్తున్నాడు.మ్యాడ్ లో నితిన్ తోపాటు సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించగా గత ఏడాది నవంబర్ లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు పెరిగిపోయాయి.కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























