కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఇరుముడి బాక్సాఫీస్ ప్రభంజనం : 200కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

Irumudi Enters the ₹200 Crore Club
బాక్సాఫీస్1 ని. చదువు

ఇరుముడి బాక్సాఫీస్ ప్రభంజనం : 200కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

Irumudi Enters the ₹200 Crore Club

Irumudi Enters the ₹200 Crore Club

మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పింది.

రెండవ వారంలోనూ తగ్గని బుకింగ్స్ మోతతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిజమైన సునామీని సృష్టిస్తోంది. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో ప్రతి ప్రాంతంలోనూ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బిజినెస్ వర్గాల అంచనాలను మించి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బెంచ్‌మార్క్‌గా నిలిచింది.

రవితేజ నటనకు తోడు దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ మాస్ డ్రామా ఎలిమెంట్స్, జివి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రీతిలో డబుల్ బ్లాక్‌బస్టర్ లాభాలను అందిస్తున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్