ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ డెకాయిట్ 

adivi seshs dacoit trending on amazon prime video

అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది.

మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో అడివి శేష్‌కు ఉన్న విజన్ ని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథలు, బలమైన కథనాలతో ఆయనకు ఉన్న క్రేజ్ ‘డెకాయిట్’తో మరింత బలపడింది.

ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, ఇద్దరి నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.

దర్శకుడిగా పరిచయమైన షనీల్ డియో ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ ధనుష్ భాస్కర్ విజువల్స్, కొదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి మరింత బలం చేకూర్చాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ చిత్రంలో ఉన్న హై ప్రొడక్షన్ వాల్యూస్ డిజిటల్ స్క్రీన్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

థ్రిల్లింగ్ కథనం, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో ‘డెకాయిట్’ స్ట్రీమింగ్ చార్ట్స్‌ను షేక్ చేస్తోంది. మంచి కంటెంట్‌కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.