కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా రూపొందుతోంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక మేకర్స్ ఈసినిమా నుండి అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మంచోడు.. మహానుభావుడు.. చెడ్డోడు రాక్షసుడు.. చూసే నీ చూపుని బట్టి, ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారుతాను’ అనే హీరో పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ లైన్ వెంటనే కనెక్ట్ అవుతూ విజిలెంట్ కథని సూచిస్తుంది.
దర్శకుడిగా జాసన్ సంజయ్ తొలి అడుగే బలమైన స్టేట్‌మెంట్‌లా కనిపిస్తుంది. స్టైలిష్‌గా, హై-ఆక్టేన్ కట్స్‌తో రూపొందిన ఈ టీజర్లో ఆయన కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్. తమన్ అందించిన దుమ్మురేపే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఎనర్జీ, ఇంటెన్సిటీని మరింత పెంచింది. డైలాగ్స్, విజువల్స్ చూస్తే సిగ్మా పూర్తిగా విజిలెంట్-హీరో జానర్ తో ఆకట్టుకుంది. ఇది దళపతి విజయ్‌తో అనుసంధానమై ఉన్న స్పేస్ అయినప్పటికీ, జెన్-జీ టచ్‌తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు.విజువల్‌గా టీజర్ చాలా రిచ్‌గా, క్లాసీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ, సినిమాకు గ్రాండ్ సినీమాటిక్ ఫీల్ ఇస్తుంది. లైకా ప్రొడక్షన్స్ మరోసారి తమ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను పెద్ద స్థాయిలో ప్రజెంట్ చేసింది.
సందీప్ కిషన్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టీజర్ లో అదరగొట్టారు. యాక్షన్, ఇంటెన్సిటీ, ఎనర్జీ—మూడు అంశాల్లోనూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. అంతర్గత సంఘర్షణ, ఆశయం, సహజ స్వభావంతో మలచబడిన పాత్రలో ఆకట్టుకున్నారు. ఇంతకుముందెన్నడూ చూడని హై-ఇంపాక్ట్ యాక్షన్ అవతార్‌లో సుందీప్ కిషన్ రా అగ్రెషన్‌కి స్టైలిష్ స్వాగ్ ని అద్భుతంగా క్యారీ చేశారు.కథనం ఒక ట్రెజర్ హంట్ చుట్టూ తిరుగుతుందని టీజర్ సూచిస్తోంది. యాక్షన్, ట్విస్టులు, థ్రిల్స్‌తో నిండిన ఈ ప్రయాణం ఆసక్తిని మరింత పెంచుతుంది. సుందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుధర్శనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేథరిన్ ఒక హై-ఎనర్జీ స్పెషల్ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తన్న ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగులో సిగ్మా 2026 సమ్మర్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























