కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

సరిపోదా శనివారం 5 డేస్ కలెక్షన్స్

Saripodhaa Sanivaaram Box Office Day 5 Collections
బాక్సాఫీస్2 ని. చదువు

సరిపోదా శనివారం 5 డేస్ కలెక్షన్స్

Saripodhaa Sanivaaram Box Office Day 5 Collections

Saripodhaa Sanivaaram Box Office Day 5 Collections

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ విడుదలకు ముందే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 29న విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాలలో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఈ సినిమా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుండటం విశేషం. కొన్ని ఏరియాల్లో వర్షం ఎఫెక్ట్ వున్నా ఈ సినిమా సూపర్ గా హోల్డ్ చేస్తుంది.

ఈ క్రమంలో ఇప్పటివరకూ 5 రోజుల్లో ఈ సినిమా 75.26 కోట్ల షేర్ రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్ లో 80శాతం పైగా రికవరీ చేసింది. ఇదే జోరు కొనసాగితే మరో 1, 2 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది ఈ చిత్రం. ఇదే కనుక జరిగితే నానికి ఇది రెండో 100కోట్ల సినిమా అవుతుంది. ఇంతకుముందు 'దసరా' మూవీతో తొలిసారి ఆ క్లబ్ లో జాయిన్ అయ్యాడు నాని.

ఇక ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. మురళి జి సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు. స్టార్ డైరెక్టర్ దిల్ రాజు హోం బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్