శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. కామెడీ హార్రర్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బాగానే ఆకట్టుకుంది.
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఇప్పటికే ప్రకటించారు. మే8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఆ టైమ్ రానే వచ్చేసింది. ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్ లో చూడని వారు ఈసినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
K@KonaFilmCorp
పార్ట్ 2 అంటే పగ గట్టిగా ఉండొచ్చు...🤨 మళ్లీ వచ్చిందంటా గీతాంజలి...చూడండి మరి!👻 Watch #GeethanjaliMalliVachindi streaming now!🎬📷https://t.co/3k84Y7ziiT#Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati #SujathaSiddarth @plakkaraju @Actorysr
కాగా ఈసినిమాలో మలయాళ నటుడు రాహుల్ మాధవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించారు.