హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై గత కొంత కాలంగా చాలా మంది హీరోయన్స్ మాట్లాడుతూనే ఉన్నారు. హీరోలకు తగ్గట్టు హీరోయిన్లకు రెమ్యునరేషన్లు ఉండవని ఎన్నోసార్లు బహిరంగంగానే చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సమంత కూడా హీరోయిన్ రెమ్యునరేషన్ పై స్పందిస్తూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోహీరోయిన్స్ కు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను కూడా పరోక్షంగా ఎప్పటినుండో పోరాడుతున్నాను.. హీరోయిన్స్ పడుతున్న కష్టాన్ని గుర్తించిన నిర్మాతలు దానికి తగ్గ విధంగానే రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుందని అన్నారు. అయితే ఖచ్చితంగా మాకు ఇంత ఇవ్వాల్సిందేని డిమాండ్ చేయడం లేదు.. కానీ మాకు ఇంత ఇవ్వండి అంటూ యాచించాల్సిన అవసరం కూడా లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్స్ గొప్పగా కష్టపడుతున్నారు.. రాబోయే రోజుల్లో భారతీయ సినిమా పరిశ్రమ మరింతగా వృద్ధి చెందాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సమంత పలు ప్రాజెక్ట్స్ తో బిజాగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమా శాకుంతలం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సమంత కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: