భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ధమ్కీ

Das Ka Dhamki Is Running Successfully With Huge Collections

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
హీరోగా విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేత పేతురాజ్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. రావు రమేష్ సైతం పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ధమ్కీ మూవీ నాలుగురోజుల్లో 8. 37 క్రోర్స్ కలెక్షన్స్ రాబట్టి , నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6 రోజులకు సుమారు 10 కోట్ల షేర్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిగా మూవీగా నిలిచింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా ధమ్కీ మూవీ కి అద్భుత రెస్పాన్స్ లభిస్తుంది. విశ్వక్ సేన్ నటించిన ఇంతకు ముందు చిత్రాలు యూ ఎస్ లో మొత్తం లాంగ్ రన్‌లో కలిపి 2 లక్షల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేయనప్పటికీ, ధమ్కీ మూవీ మొదటి వారంలోనే 3లక్షల డాలర్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ USAలో విశ్వక్ సేన్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fourteen =