కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Das Ka Dhamki Movie Latest Box Office Collections

ట్యాగ్ · 7 కథనాలు

Dhamki movie 10 days collections
బాక్సాఫీస్

దాస్ కా ధమ్కీ 10డేస్ కలెక్షన్స్

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా స్టడీ గా వసూళ్ళను రాబట్టుకుంటుంది. ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రం 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 8.50కోట్ల షేర్ ను రాబట్టింది. ఈగురువారం,నాని నటించిన దసరా విడుదలకావడంతో ధమ్కీ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కొంటుంది. అయితే ధమ్కీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విశ్వక్ సేన్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్
dhamki movie first week collections
బాక్సాఫీస్

ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకొని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధమ్కీ. ఈసినిమా ఉగాది పండుగ నాడు రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నటన, కథ, పాటలు అన్నీ నచ్చడంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. విశ్వక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందిస్తుంది. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ ఫస్ట్ వీక్ లో మొత్తంగా ఈమూవీ రూ. 21.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం…

TFN Adminవాట్సాప్
Das Ka Dhamki Is Running Successfully With Huge Collections
బాక్సాఫీస్

భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ధమ్కీ

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. హీరోగా విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేత పేతురాజ్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. రావు రమేష్ సైతం పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించారు.

Team TFNవాట్సాప్
Das Ka Dhamki Movie 3 Days Collections
బాక్సాఫీస్

దాస్ కా ధమ్కీ 3 డేస్ కలెక్షన్స్

విశ్వక్ సేన్ ,దాస్ కా ధమ్కీ వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీ గా కలెక్షన్స్ ను రాబడుతూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. నిన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ అదరగొడుతుంది. ఇప్పటివరకు అక్కడ 250k గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఓవరాల్ గా 3రోజుల్లో ధమ్కీ, ప్రపంచ వ్యాప్తంగా 15కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరో కోటి రూపాయల షేర్ వస్తే చాలు మూవీ బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈరోజుతో ఆమార్క్ ను చేరుకోనుంది. ఇక కేవలం మూడు రోజుల్లోనే ధమ్కీ ,విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. యూత్ ఫుల్…

Mahender Reddyవాట్సాప్
Dhamki Movie 2 Days Collections Worldwide
బాక్సాఫీస్

ధమ్కీ రెండో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది

ఫలక్ నుమా దాస్ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి విశ్వక్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను ఇవ్వగా రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. రెండో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలో 2కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది.

Mahender Reddyవాట్సాప్
యూఎస్ బాక్సాఫీస్ కు విశ్వక్ ధమ్కీ
బాక్సాఫీస్

యూఎస్ బాక్సాఫీస్ కు విశ్వక్ ధమ్కీ

ఈమధ్య యంగ్ హీరోలు హీరోలుగా మాత్రమే కాదు డైరెక్టర్లుగా, రచయితలుగా కూడా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ముందుంటాడు విశ్వక్ సేన్. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తన సత్తా చూపిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరోసారి ధమ్కీ తో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ధమ్కీ. ఈసినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్ చూపించిన వేరియన్స్ అలానే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను…

TFN Adminవాట్సాప్
Das Ka Dhamki Movie Day 1 Collections
బాక్సాఫీస్

దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే కలెక్షన్స్..

ట్యాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టింది. నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.88కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ మూవీ గా నిలిచింది. ఉగాది సందర్భంగా నిన్న సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకు చాలా చోట్ల హోస్ ఫుల్ కలెక్షన్స్ పడ్డాయి. ఇక ఈచిత్రం 4కోట్లకు పైగా షేర్ ను తెచ్చుకోవడంతో తొలిరోజే బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా కలెక్ట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్

షేర్