
ట్యాగ్ · 3 కథనాలు


కంగువ.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది ఎవరంటే..?

గేమ్ ఛేంజర్.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

కంగువ.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది ఎవరంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఫార్స్ ఫిల్మ్స్ ఎల్ ఎల్ సి కి సలార్ మూవీ ఓవర్సీస్ రైట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు…