డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సిక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. గతంలోనే ఈ సిక్వెల్ పై స్పందించైనా రాజమౌళి తాజాగా మరోసారి సిక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డ్ తనను మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుందనీ , ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సిక్వెల్ మరింత వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామనీ , సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు సీక్వెల్ చేయాలనుకున్నామనీ , అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనీ , కానీ అంత స్పష్టంగా అనుకోలోదనీ , కానీ విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడం తో తాను మా నాన్న, మా కజిన్ ఎంఎం కీరవాణితో మరోసారి చర్చించినప్పుడు తనకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందనీ , దీంతో వెంటనే మా నాన్న స్క్రిప్ట్ రాయడం ప్రారంభించారనీ , స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేమనీ , కానీ వీలైనంత తొందరగా సీక్వెల్ పూర్తి చేస్తామనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: