100 K ఇంట్రెస్ట్స్ తో బుక్ మై షో లో సలార్ మూవీ సెన్సేషనల్ రికార్డ్
Prabhas salaar movie got 100k interests on bookmyshow

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
సలార్ మూవీ రిలీజ్‌కు ఏడు నెలల ముందుగానే బుక్‌మై షో యాప్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బుక్‌మై షోలో 100 K ఇంట్రెస్ట్స్ పొందిన సినిమాగా నిలిచింది.పాన్ ఇండియన్ లెవెల్‌లో సలార్‌కు ఉన్న క్రేజ్‌కు ఈ రికార్డ్ నిదర్శనమని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో సలార్ రిలీజ్ కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.








