ఓటీటీ లోకి వచ్చేసిన వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Streaming Now,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya Movie,Waltair Veerayya,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Movie Latest News,Waltair Veerayya In Netflix Now,Waltair Veerayya Movie Streaming Now In Netflix, Waltair Veerayya In OTT Netflix, Waltair Veerayya Streaming In OTT,Waltair Veerayya OTT Netflix Out

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. నిజానికి సంక్రాంతి బరిలో దిగిన అన్ని సినిమాలకంటే కూడా ఈసినిమా ఎక్కువ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య ఊచకోత నడిచింది. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి విన్నర్ అయ్యారు చిరంజీవి.
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటించారు. చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =