
ట్యాగ్ · 4 కథనాలు


"భోళా శంకర్"మూవీ కొత్త షెడ్యూల్ డేట్

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్

భోళా శంకర్ మూవీ లో మరింత స్మార్ట్ గా మెగా స్టార్ చిరంజీవి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

భోళా శంకర్- 200 డ్యాన్సర్స్ తో సాంగ్ షూట్
గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇక అప్పుడే తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళాశంకర్. మేకర్ మెహర్ రమేష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

"భోళా శంకర్"మూవీ కొత్త షెడ్యూల్ డేట్
మెగా స్టార్ చిరంజీవి హీరోగా "భోళా శంకర్ ", “గాడ్ ఫాదర్ “, “చిరంజీవి 154 “మూవీస్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్
ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "వేదాళం"తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.