
ట్యాగ్ · 3 కథనాలు


భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్

భోళా శంకర్- 200 డ్యాన్సర్స్ తో సాంగ్ షూట్
గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇక అప్పుడే తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళాశంకర్. మేకర్ మెహర్ రమేష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి అప్పుడే బిజీ అయిపోయారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఈసినిమా రిలీజ్ అయిన మూడురోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతవరకూ వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్న చిరు ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టేశారు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్
ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "వేదాళం"తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.