కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

జపాన్ లో 42 సెంటర్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ శతదినోత్సవం

RRR Movie Completes 100 Days In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie

జపాన్ లో 42 సెంటర్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ శతదినోత్సవం

RRR movie completes 100 days in Japan

RRR Movie Completes 100 Days In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆర్ఆర్ఆర్ మూవీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఆర్ఆర్ఆర్ మూవీ 714 మిలియన్ యెన్స్ (సుమారు 45కోట్లు )కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రతిష్టాత్మకమైన జపాన్ అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా అవార్డును సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో మరో అరుదైన ఫీట్ ని సెట్ చేసి మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా అక్కడ 100 రోజుల థియేట్రికల్ రన్ ని డైరెక్ట్ గా 42 సెంటర్స్, షిఫ్ట్ లతో 114 సెంటర్స్ లో జరుపుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.దీనితో ఈ చిత్రం జపాన్ లో 100 రోజులు ప్రదర్శితం కాబడిన మొదటి భారతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్