శాకుంతలం సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam Movie Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Songs,Shaakuntalam Movie Songs,Shaakuntalam Telugu Movie Songs,Samantha,Samantha Shaakuntalam Movie Songs

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం.
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవలే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ మల్లికా మల్లికా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈపాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈపాటకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. రుషివనంలోన అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 25వ తేదీన తెలుగు తోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =